ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్త
తాడేపల్లి, అమరావతి
Dr. B.R. అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన
Notification No: APSWREIS/2308989/2023, dated 23.01.2024
Dr. BRAG FIFTH CET – 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 2024-25 విద్యా సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేదీ: 25.01.2024 నుండి 23.02.2024 వరకు ఆన్ లైన్లో సమర్పించుటకు గాను నోటిఫికేషన్ జారీచేయటం జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం కొరకు Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr. B.R. అంబేడ్కర్ గురుకులాల ప్రధానాచార్యుల (Principals) వారిని గాని సంప్రదించగలరు.
అభ్యర్హులకు సూచనలు:
I. ప్రవేశమునకు అర్హత:
* వయన్సు: ఎస్.సి. (S.C) మరియు ఎస్ టి (S.T.) విద్యార్ధులు తేదీ 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓ సి (O.C.), బి.సి. (B.C.), ఎస్ సి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ (BC-C) విద్యార్ధులు తేదీ 01.09.2013 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.
* సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2023-24 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పాందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
* ఆదాయ పరిమితి: అభ్యర్ది యొక్క తల్లి, తండ్రి/ సంరక్షకులు సంవత్సరాదాయము రూ.1,00,000/- మించి ఉండరాదు.
II. రిజర్వేషన్ వివరాలు:
* అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C – 75%, BC-C (Converted Christians)-12%, ST-6%, BC-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.
* ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికేట్ ను జతపరవలెను. వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
* ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని SC కేటగిరి విద్యార్దులకు కేటాయిస్తారు.
* ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మచారి విద్యార్ధులకు కేటాయించబడును.
* అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక – A (Annexure A) నందు ఇవ్వబడినవి.
III. ధరఖాస్తు చేయు విధానం:
* ఆసక్తి గల విద్యార్ధులు https://apbragcet.apcfss.in/ ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.
* తేదీ 25.01.2024 నుండి 23.02.2024 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తేదీ 23.02.2024 తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.
* విద్యార్ధులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును.
* దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
* ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్హి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
* ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.
IV ఎంపిక విధానము:
2024-25 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేది 10.03.2024 న 10.00 AM నుండి 12.00 noon వరకు నిర్వహించి అందులో వారు సాధించిన మార్కుల ఆధారంగా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.
V) ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల వివరములు (Annexure – A) మరియు జిల్లా సమన్వయ అధికారుల ఫోన్ నంబర్లు (Annexure – B) మరియు ఇతర
వివరములు (Annexure – C) నందు తెలుపబడినవి.
Leave a Reply