P. V. Narasimha Rao Telangana Veterinary University
Administrative Office, Rajendranagar, Hyderabad – 500 030
Admission to Animal Husbandry Polytechnic Diploma (2 Years)
పి. వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము
పరిపాలనా కార్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500 030
పశుసంవర్ధక పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశము (2 సం॥లు)
మార్గదర్శక సూత్రాలు
2024-2025
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకొనుటకు ప్రారంభ తేదీ: 27-06-2024 (ఉ:10.00 గం)
ముగింపు తేదీ: 20-07-2024 (సా:5.00 గం)
ఉపోద్ఘాతం: పి.వి. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయము, పశువైద్య మరియు తదనుబంధ విషయాలలో డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చుచున్నది. గ్రామ సీమలలో నివసించే యువకులు వారు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో, వారు కాలేజీలలో చేరి డిగ్రీలు చదవలేరనే ఉద్దేశంతో వారికి పశుపోషణ పరిశ్రమలలో శిక్షణనివ్వడానికిగాను పాలిటెక్నిక్‌లను ఏర్పాటు చేసారు. అంతేకాక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో పశుపోషణ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పనిచేయడానికి మంచి ఉద్యోగస్థుల అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 2005-06 సంవత్సరంలో మహబూబ్ నగర్ లోని మహబూబ్ నగర్ పశుపోషణ పరిశోధన స్థానములో మరియు కరీంనగర్ జిల్లాలో పశుసంవర్ధక పాలిటెక్నిక్ లు ప్రారంభించబడినవి. తరువాత 2008-09 విద్యా సంవత్సరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట నందు మరియు మళ్ళీ 2011-12 విద్యాసంవత్సరంలో హనుమకొండ జిల్లాలోని మామునూరు నందు పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించబడినవి.
ఎంత మందిని చేర్చుకుంటారు
ఈ సంవత్సరం మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో 30 మంది చొప్పున మరియు మామునూర్ పశుసంవర్ధక పాలిటెక్నిక్ లలో 20 మందిని చేర్చుకుంటారు. పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలలలో అదనంగా ఏ రిజర్వేషన్ లేని ఆర్ధికంగా బలహీన వర్గం వారికి 10% సీట్లు కేటాయించంబడినవి.
అర్హత
అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పౌరులు అయి ఉండాలి. పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై TG POLYCET 2024 (MBiPC) లో ర్యాంకు పొంది ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం నాలుగు సంవత్సరములు గ్రామీణ ప్రాంతాలలోని (నాన్ మున్సిపల్ పరిధి) పాఠశాలలో చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి, దీనికి గాను దరఖాస్తు ఫారానికి జతపరచబడిన ఫారం నెం. A ప్రకారం వారు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారితో పూరించి ధృవీకరించాలి. ఫారం నెం. A పూర్తి చేయని దరఖాస్తును లెక్కలోనికి తీసుకోరు. దరఖాస్తుదారుడు రెండు లేదా ఎక్కువ పాఠశాలలో చదివిన యెడల, ప్రతి పాఠశాలకు ఒక ఫారం నెం. A జతపరచవలెను. పదవ తరగతి కంపార్ట్ మెంట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం
తెలంగాణ పాలీసెట్ 2024 MBiPC ర్యాంకు మరియు రిజర్వేషన్ ఆధారముగా అభ్యర్థులను ఎంపిక చేయబడును.
వయస్సు
పాలిటెక్నిక్ కోర్సులో చేరబోవు అభ్యర్థి 31-08-2024 తేదికి 15-22 సంవత్సరముల మధ్య
వయస్కుడై ఉండాలి. (30-08-2002 తరువాత మరియు 01-09-2009 లోపు జన్మించినవారై ఉండాలి).
రిజర్వేషన్ పద్దతి
a) వెనుకబడిన తరగతుల (బి.సి) వారికి 29 శాతం సీట్లను ఈ క్రింది విధంగా రిజర్వు చేయటం జరిగింది. వర్గము – బి.సి-ఎ-7 %, బిసి-బి- 10%, బి.సి- సి-1%, బి.సి-డి – 7% మరియు బి.సి-ఇ-4%
b) షెడ్యూలు కులముల (SC) అభ్యర్థులకు 15 శాతం మరియు షెడ్యూలు తేగల (ST) వారికి 10 శాతం సీట్లు రిజర్వు చేయబడినవి.
c) స్త్రీలకు 33 1/3 శాతం సీట్లు రిజర్వు చేయబడినవి.
d) ఆర్థికంగా బలహీన వర్గం వారికి అదనంగా 10 శాతం సీట్లు రిజర్వు చేయబడినవి.
e) స్వాభావికమైన అంగవైకల్యము (Physically Challenged) కల వారికి కేటాయించబడిన సీట్లు – ౩ శాతం.
f) ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్సు వ్యక్తులతో పాటు బార్జర్ సెక్యూరిటీ ఫోర్స్, కేంద్ర రిజర్వు పోలీస్ దళం మొదలగు వారి పిల్లలకు (వారి తల్లి తండ్రులు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరములు నివాసమున్న వారికి) కేటాయించబడిన సీట్లు – 2 శాతము .
g) నేషనల్ కాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి.) – 1 శాతము.
h) క్రీడలు – 0.5 శాతము.
ఫీజులు: పాలిటెక్నిక్‌లలో ప్రవేశార్హత పొందిన వారు ఈ క్రింది విధంగా ఫీజులు చెల్లించాలి.
విశ్వవిద్యాలయ ఫండ్:
* ట్యూషన్ ఫీజు రూ. 580/- సెమిస్టరుకు ఒకసారి
* ప్రవేశ రుసుము రూ. 190/- (మొదటి సంవత్సరము మాత్రమే)
* పరీక్ష ఫీజు రూ. 320/- సెమిష్టరుకు ఒకసారి
* డిప్లొమా పాస్ సర్టిఫికెట్ రూ. 580/-
* వైద్య రుసుము రూ. 320/- సెమిస్టరుకు ఒకసారి.
విశ్వవిద్యాలయ ఇతర ఫండ్:
* ప్రయోగశాల ధరావత్తు రూ. 310/- పాలిటెక్నిక్ వదిలి పెట్టే సమయంలో వాపసు ఇవ్వబడును
* గ్రంథాలయ ధరావత్తు రూ. 250/- పాలిటెక్నిక్ వదిలి పెట్టే సమయంలో వాపసు ఇవ్వబడును
* ఆటల ఫీజు రూ. 280/- (సెమిస్టరుకు ఒకసారి)
* విద్యార్థి కార్యక్రమాలు రూ.900/- (సంవత్సరమునకు)
* పరీక్షలకు సంబంధించిన రూ.250/- (సెమిస్టరుకు ఒకసారి)
* విద్యార్థుల సంక్షేమ నిధి రూ.350/- (ప్రవేశ సమయంలో మాత్రమే)
* పాత విద్యార్ధుల నిధి రూ.770/- కోర్స్ చివరి సెమిస్టరులో కట్టవలసినది
* భీమా పథకము రూ. 980/- సంవత్సరమునకు (మొదటి సెమిస్టరు ఫీజుతో కలిపి)
* బదిలీ సర్టిఫికెట్ రూ. 160/-
* కాండక్ట్ సర్టిఫికేట్ రూ. 160/-
* బోనఫైడ్ సర్టిఫికెట్ రూ. 180/-
పాలిటెక్నిక్‌లలో ప్రవేశార్హత పొందిన వారు హాస్టలు నిమిత్తం ఈ క్రింది విధంగా ఫీజులు చెల్లించవలయును.
* హాస్టలు వసతి రూ.6340/- (చేరినప్పుడు మాత్రమే) ధరావత్తు
* మెస్ కు రూ.6340/- (చేరినప్పుడు మాత్రమే) ధరావత్తు
* హాస్టలు సిబ్బంది ఖర్చులు వగైరా రూ.490/- నెలకొక పర్యాయము
* గది అద్దె రూ.980/- (సెమిష్టరుకు ఒకసారి)
ముఖ్య గమనిక: హాస్టల్ మెస్ బిల్లు ప్రతి నెల క్రమము తప్పకుండా చెల్లించవలయును.
కోర్సు కాలపరిమితి:
* కోర్సు రెండు సంవత్శరములుండును, ప్రతి సంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఉండును.
* చదవవలసిన కోర్సులు, సిలబసు, నిబంధనలు విశ్వవిద్యాలయము యొక్క అకడమిక్ కౌన్సిలు నిర్ణయించిన విధంగా ఉంటాయి.
ఈ కోర్స్ చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో ఉంటుంది.
హాస్టలు వసతి: ఈ కోర్సులో ప్రవేశము పొందిన వారు ఎక్కడైతే హాస్టలు వసతికలదో అక్కడ తప్పనిసరిగా హాస్టలులో ఉండవలెను. బయట వుండదలచినట్లయితే ప్రిన్సిపాల్ గారి వద్ద ముందుగా అనుమతి పొందాలి.
దరఖాస్తు ఫారంను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ (https://tsvu.nic.in/) నుండి డౌన్‌లోడ్ చేసుకొని పూరించి, ఫారంతో పాటు పైన పేర్కొన్న ధృవ పత్రాలతో రూ.830/- (జనరల్ కేటగిరీ మరియు ఇతరులు) రూ. 415/- (ఎస్.సి., ఎస్.టి. మరియు అంగవైకల్యం కలిగిన అభ్యర్థులు) అప్లికేషను ఫీజు SBI Collect ద్వారా చెల్లించవలెను.
ఫీజు చెల్లించిన కాపీ అప్లికేషన్‌తో జతచేసి (జతపరచవలసిన అన్ని ధ్రువపత్రాలు సరిచూసుకొని)
To,
Registrar,
P.V.Narasimha Rao Telangana Veterinary University,
Administrative Office, Rajendranagar, Hyderabad – 500 030
పేరున రిజిస్టర్ పోస్టులో/స్పీడ్ పోస్టులో నిర్దిష్ట సమయం లోపల (20-07-2024) 4:00 PM విశ్వవిద్యాలయానికి అందేటట్లు పంపించాలి.
పూర్తి వివరాలకు, క్రింద జతపరచిన నోటిఫికేషన్ ను చూడగలరు:
Leave a Reply